Shubman gill: కెప్టెన్సీ ఎంపిక చిక్కుముళ్ల వేళ గంభీర్‌తో గిల్ సుదీర్ఘ భేటీ
Shubman gill: కెప్టెన్సీ ఎంపిక చిక్కుముళ్ల వేళ గంభీర్‌తో గిల్ సుదీర్ఘ భేటీ"
Play all audios:
రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం నూతన కెప్టెన్ ఎంపిక విషయమై బీసీసీఐ, సెలక్షన్ కమిటీ మల్లగుల్లాలు పడుతోంది. ఈ సమయంలో శుభ్‌మన్ గిల్, టీమ్ఇండియా కోచ్
గంభీర్‌తో సుదీర్ఘంగా సమావేశమయ్యాడన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ (Rohit Sharma) తన టెస్ట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన
సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎన్నిక విషయమై బీసీసీఐ (BCCI), సెలక్షన్ కమిటీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. కెప్టెన్ రేసులో ముందు వరుసలో ఉన్న గిల్ (Shubman Gill).. ఇలాంటి
సమయంలో గౌతమ్ గంభీర్‌తో ఓ నాలుగైదు గంటల పాటు భేటీ అయ్యాడని తెలుస్తోంది. అలాగే బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా మే 6న వాంఖడే స్టేడియంలో గిల్‌తో మాట్లాడాడు. నూతన టెస్ట్
కెప్టెన్ ఎంపిక జరగాల్సిఉన్న వేళ ఈ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్‌కు మే 7న వీడ్కోలు పలికాడు. ఈనేపథ్యంలో తదుపరి కెప్టెన్ రేసులో ఉన్నారని శుభ్‌మన్‌గిల్,
జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), రిషభ్ పంత్ (Rishabh Pant), కేఎల్ రాహుల్ (KL Rahul) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జూన్ 20న ప్రారంభం కానున్న ఇంగ్లండ్ టూర్‌తో భారత టెస్టు జట్టు
నూతన సారథి ప్రయాణం ప్రారంభం కానుంది. అయినప్పటికీ ఇప్పటివరకైతే అధికారికంగా ఎవరి పేరూ ఖరారు కాలేదు. ఇంకా కెప్టెన్ ఎంపిక చిక్కుముళ్లు వీడనివేళ శుభ్‌మన్ గిల్.. టీమ్ఇండియా కోచ్ గౌతమ్
గంభీర్‌ను దిల్లీలోని అతడి నివాసంలో కలిసినట్లు సమాచారం. ఈసందర్భంగా అతడు నాలుగైదు గంటల పాటు గంభీర్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ ప్రకటించడానికి ఒకరోజు ముందు
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మే 6న ఐపీఎల్ మ్యాచ్ అనంతరం వాంఖడే స్టేడియంలో గిల్‌తో ముచ్చటించాడు. ఈ సంఘటనలూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటివరకున్న సమాచారం మేరకు బీసీసీఐ..
శుభ్‌మన్ గిల్‌ను టీమ్ఇండియా(Team India) భవిష్యత్తు కెప్టెన్‌గా చూస్తోంది. ఈ ఐపీఎల్లో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను (Gujarat Titans) కెప్టెన్‌గా శుభ్‌మన్
గిల్ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. బ్యాటర్‌గానూ రాణిస్తున్నాడు. ఈనేపథ్యంలో బీసీసీఐ అధికారులు గిల్ మీద సానుకూల దృక్పథంతో ఉన్నట్లు సమాచారం. కొందరు టీమ్ఇండియా మాజీ దిగ్గజాలు మాత్రం
బుమ్రా వైపు మొగ్గు చూపుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అనూహ్యంగా సీనియర్ ప్లేయరైన రవీంద్ర జడేజాను (ravindra jadeja) కెప్టెన్‌గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయమూ
వ్యక్తంచేశాడు. ఏది ఏమైనప్పటికీ టీమ్ఇండియా నూతన టెస్ట్ కెప్టెన్ ఎవరనే విషయంలో ఉత్కంఠ ఇంకొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. అధికారికంగా బీసీసీఐ ఈ విషయాన్ని ఎప్పుడు ప్రకటిస్తుందా.. అని
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Trending News
Lord shiva: శివ పూజలో పొరపాటున కూడా ఇవి వాడొద్దు.. పరమేశ్వరుడికి కోపం వస్తుందంట..!తామర, మల్లె, కేతకి వంటి పూలను శివుడికి అస్సలు సమర్పించ కూడదంట. ఈ పువ్వులు లైంగిక కోరికలను ప్రేరేపిస్తాయి, కనుక వీటిని శి...
Ktr | సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలుCNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Jnu’s umar khalid calls slain terrorist burhan wani a revolutionary like che guevara - scoopwhoopJNU student Umar Khalid who was in the limelight earlier this year for holding a pro-Afzal Guru event inside the campus,...
Bahubali's kattappa aka sathyaraj joins cast of salman khan-starrer 'sikandar'She captioned the post, "Garma Garam pictures from the sets of SajidNadiadwala's Sikandar!!! With my fave Sath...
Money: PF డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా..? ముందు ఈ కీలక విషయాలు తెలుసుకోండి..Money: PF డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా..? ముందు ఈ కీలక విషయాలు తెలుసుకోండి..Published by:Sunil Boddulanews18-teluguLast ...
Latests News
Shubman gill: కెప్టెన్సీ ఎంపిక చిక్కుముళ్ల వేళ గంభీర్‌తో గిల్ సుదీర్ఘ భేటీరోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం నూతన కెప్టెన్ ఎంపిక విషయమై బీసీసీఐ, సెలక్షన్ కమిటీ మల...
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Bengaluru drugs peddling case: ed raids bineesh kodiyeri’s houseThe Enforcement Directorate officials, along with Karnataka police, raided the house of Bineesh Kodiyeri, son of CPI(M) ...
Vijay sethupathi, nithya menen to star in malayalam film ‘19(1)(a)’Actors Nithya Menen, Vijay Sethupathi, Indrajith Sukumaran and Indrans are coming together for a new Malayalam film call...
Politics: రాయలసీమలో రాజకీయ చక్రం తిప్పిన కుటుంబానికి కష్టాలు.. పరిటాల రవి ఫ్యామిలీ పోటీపై సందిగ్ధంPublished by: Last Updated:February 10, 2024 6:16 PM IST POLITICS: అనంతపురం జిల్లాకు చెందిన దివంగత నేత, టీడీపీ నాయకుడు ప...