Simran: ఆమె నాకు సారీ చెప్పింది.. వివాదంపై స్పందించిన సిమ్రన్..
Simran: ఆమె నాకు సారీ చెప్పింది.. వివాదంపై స్పందించిన సిమ్రన్.."
Play all audios:
ఇటీవల ఒక నటిని ఉద్దేశించి తాను చేసిన కామెంట్స్‌పై సిమ్రన్ స్పందించారు. తన సందేశం ఆ నటికి చేరిందని ఆమె క్షమాపణలు చెప్పిందని తెలిపారు. ఇంటర్నెట్ డెస్క్: నటి సిమ్రన్ (Simran) ఇటీవల ఓ
అవార్డు కార్యక్రమంలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాను ఒక నటిని ప్రశంసిస్తూ సందేశం పంపానని.. ఆమె రిప్లై తనని ఎంతో బాధించిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని చెబుతూ..
పనికిమాలిన డబ్బా రోల్స్‌లో నటించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రలు పోషించడం ఎంతో ఉత్తమమని అన్నారు. అయితే సిమ్రన్ చేసిన ఈ వ్యాఖ్యలు ‘డబ్బా కార్టెల్’ సిరీస్‌లో నటిని ఉద్దేశించేనంటూ చాలామంది
కామెంట్స్ చేశారు. తాజాగా దీనిపై సిమ్రన్ స్పందించారు. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సిమ్రన్.. ‘‘నేను డబ్బా కార్టెల్ సిరీస్ చూశాను. చాలా బాగుంటుంది. నేను చేసిన వ్యాఖ్యలను అందరూ
తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేశానో.. వాళ్లకు ఆ సందేశం అందింది. ఆమె నాకు క్షమాపణలు చెప్పింది. నన్ను బాధించడం తన ఉద్దేశం కాదని చెప్పింది. ఈ విషయంలో ప్రజలు
అనవసరంగా ఎక్కువగా ఊహించుకున్నారు. నాకు ఎక్కువ మంది స్నేహితులు లేరు. ఎవరి గురించి గాసిప్‌లు మాట్లాడను. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా బహిరంగంగా చెబుతాను’’ అని సిమ్రన్ అన్నారు. * జాన్వీని
విపరీతంగా ట్రోల్ చేశారు కానీ..: దర్శకుడు వ్యాఖ్యలు అసలేం జరిగిందంటే.. కొన్ని రోజుల క్రితం తనకు బాగా తెలిసిన తోటి నటికి సిమ్రన్ సందేశం పంపారు. ఆమె నటించిన ఓ సినిమాని ఉద్దేశించి అందులో
రాసుకొచ్చారు. ఆ సినిమాలో ఆమె పాత్ర చాలా బాగుందని.. ఆ రోల్ చూసి ఆశ్చర్యపోయానని మెసేజ్ పంపారు. దానికి ఆ నటి వెంటనే స్పందించింది. ‘ఆంటీ రోల్స్‌లో నటించడం కంటే ఇది ఎంతో ఉత్తమం అంటూ’ రిప్లై
ఇచ్చింది. దీనిపై సిమ్రన్ ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘నిజం చెప్పాలంటే ఆమె పంపిన మెసేజ్ నన్ను ఒకింత షాక్‌కు గురిచేసింది. ఆమె ఎంతో చులకనగా మాట్లాడినట్లు అనిపించింది. ఈ వేదికగా
ఆమెకు నేను చెప్పేది ఒక్కటే. పనికిమాలిన డబ్బా రోల్స్‌లో నటించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రలు పోషించడం ఎంతో ఉత్తమం. ఏ వర్క్ చేసినా ఆత్మస్థైర్యంతో ముందుకుసాగాలి. మనపై మనం నమ్మకం ఉన్నప్పుడే
వర్క్ కూడా అనుకున్నవిధంగా పూర్తి చేయగలుగుతాం. దేనినీ చులకనగా చూడకూడదు’’ అని ఆమె హితవు పలికారు.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...
జూమ్ వర్సెస్ జియోమీట్తమ యాప్‌ను కాపీ కొట్టారన్న జూమ్ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...
Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malayaFor all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
Latests News
Simran: ఆమె నాకు సారీ చెప్పింది.. వివాదంపై స్పందించిన సిమ్రన్..ఇటీవల ఒక నటిని ఉద్దేశించి తాను చేసిన కామెంట్స్‌పై సిమ్రన్ స్పందించారు. తన సందేశం ఆ నటికి చేరిందని ఆమె క్షమాపణలు చెప్పిం...
Shubman gill: కెప్టెన్‌గా నీ ప్రవర్తనే ఇప్పుడు చాలా ముఖ్యం: గిల్‌కు గావస్కర్ సూచనఇంటర్నెట్ డెస్క్: టెస్టు ఫార్మాట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు యువ ఆటగాడు ...
Cyber crime: అచ్యుతాపురం to అమెరికా.. నెలకు రూ. 20కోట్ల మేర సైబర్ మోసాలుఅనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కాల్‌సెంటర్ ద్వారా అమెరికా వాసులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడిన ముఠాను అరెస్...
Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు ఢీకొని తల్లి, కుమారుడు మృతిఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బుడదంపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తాటి ముంజలు కొంటున్న వారిపైకి కారు దూసు...
Us news: అమెరికా కీలక నిర్ణయం.. యూఎస్ పౌరుల పోస్టులను సెన్సార్ చేసేవారికి వీసా నిషేధంఅమెరికా: విదేశీ అధికారులను లక్ష్యంగా చేసుకొని అగ్రరాజ్యం అమెరికా (USA) మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్ సోషల్ మీడియా ...