S jaishankar: భారత్-పాక్ ఉద్రికత్తలు.. జైశంకర్‌కు బుల్లెట్‌ప్రూఫ్ కార్లు
S jaishankar: భారత్-పాక్ ఉద్రికత్తలు.. జైశంకర్‌కు బుల్లెట్‌ప్రూఫ్ కార్లు"
Play all audios:
S Jaishankar: భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు బుల్లెట్‌ప్రూఫ్ కార్లతో భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. దిల్లీ: కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్
జైశంకర్‌కు కేంద్ర హోంశాఖ భద్రత మరింత పెంచినట్లు సమాచారం. దిల్లీలోని ఆయన (S Jaishankar) నివాసం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతతో పాటు.. రెండు ప్రత్యేక బుల్లెట్‌ప్రూఫ్ కార్ల (Bulletproof Car)ను
కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రభుత్వ అధికారిక వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో భారత్, పాకిస్థాన్
మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. జైశంకర్‌కు ఇప్పటికే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కమాండోలతో కూడిన జడ్-కేటగిరీ భద్రత కొనసాగుతోంది. 33 మంది
కమాండోల బృందం నిరంతరం ఆయనకు రక్షణవలయంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ భద్రతతో పాటు అదనంగా రెండు బుల్లెట్‌ప్రూఫ్ కార్లను కూడా ఆయన కాన్వాయ్‌లో చేర్చినట్లు సదరు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర
నిఘా వర్గాల నుంచి అందిన హెచ్చరికల సమాచారం నేపథ్యంలో హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. * ఉగ్రవాదం కొనసాగితే పాక్ అంతుచూస్తాం.. ఆపరేషన్ సిందూర్‌తో లక్ష్మణరేఖ గీశాం
సాధారణంగా హై ప్రొఫైల్ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలకు ముప్పు పొంచిఉన్న సందర్భాల్లో జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తారు. జైశంకర్‌కు ముప్పు అంచనాలపై గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రానికి నివేదిక
ఇచ్చింది. దీంతో 2023 అక్టోబరులో ఆయనకున్న వై కేటగిరీ భద్రతను జడ్ కేటగిరీకి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి ఆయన భద్రతను పెంచడం గమనార్హం.
Trending News
Sajjala estate: ‘సజ్జల’ ఎస్టేట్‌లో 63 ఎకరాల ఆక్రమిత భూమి స్వాధీనంవైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని వైకాపా నేత, గత ప్రభుత్వంలో సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్ట...
Rcb vs kkr: ఆర్సీబీ vs కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్17/05/2025 16:22(IST) ఆర్సీబీ, కోల్‌కతా మ్యాచ్‌కు వర్షం ముప్పు తొమ్మిది రోజుల అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ పునఃప్రార...
Moeen ali: ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో మా అమ్మానాన్న పీఓకేలోనే: మొయిన్ అలీMoeen Ali: భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇంగ్లాండ్ క్రికెటర్ మొయిన్ అలీ తల్లిదండ్రులు పాక్ ఆక్రమిత కశ్మీర్...
Pakistan: సరిహద్దు రాష్ట్రాల నుంచి పాక్‌కు చాటింగ్‌లు.. ఈమెయిల్స్‌పై నిఘా..Pakistan ఇంటర్నెట్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్ మొదలైన నాటినుంచి జమ్మూకశ్మీర్ సహా సరిహద్దు రాష్ట్రాల నుంచి పాక్‌కు వెళ్లి...
Canada | latest canada - eenaduకెనడా ఉక్కు, అల్యూమినియంపై 50% సుంకాలు అమెరికా, కెనడాల మధ్య సుంకాల యుద్ధం మరింత ముదురుతోంది. ఇప్పటికే 25 శాతం సుంకాలతో క...
Latests News
S jaishankar: భారత్-పాక్ ఉద్రికత్తలు.. జైశంకర్‌కు బుల్లెట్‌ప్రూఫ్ కార్లుS Jaishankar: భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు బుల్లెట్‌ప్రూఫ్ కార్లతో భద్రత కల్పించ...
Eps opens buttermilk stalls in tamil nadu's konganapuram, edappadiSALEM: AIADMK general secretary Edappadi K Palaniswami on Saturday inaugurated buttermilk stalls set up by party members...
Anam ramanarayana reddy | latest anam ramanarayana reddy - eenaduసోమశిల, కండలేరు జలాశయాలను సందర్శించనున్న మంత్రి నిమ్మల మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, ఎంపీ ప్రభాకర్‌రెడ్డ...
Suriya | latest suriya - eenaduనాన్నే మా హీరో! సెలెబ్రిటీలు బయటకు వెళ్లారంటే జనాలు చుట్టుముట్టేస్తుంటారు. వాళ్లతో మాట్లాడాలనీ, కుదిరితే సెల్ఫీ తీసుకోవా...
Jp nadda | latest jp nadda - eenaduసార్వత్రిక ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా సార్వత్రిక ఎన్నికలకు ‘సంకల్ప పత్రం’ పేరుతో భాజపా మేనిఫెస్టోను విడుద...