Chirag paswan: అలా అయితే బిహార్‌లో పోటీ చేస్తా: చిరాగ్‌ పాశ్వాన్‌

Eenadu

Chirag paswan: అలా అయితే బిహార్‌లో పోటీ చేస్తా: చిరాగ్‌ పాశ్వాన్‌"

Play all audios:

Loading...

బిహార్‌ అభివృద్ధి కోసం తాను పని చేస్తున్నానని.. అవకాశం ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాగ్ తెలిపారు. దిల్లీ: లోక్‌ జన్‌శక్తి పార్టీ(రామ్‌ విలాస్‌)


అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌ (Chirag Paswan) కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు


వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరాగ్‌ స్పందించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేస్తానని పేర్కొన్నారు.  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై విలేకరుల సమావేశంలో ఎదురైన


ప్రశ్నపై చిరాగ్‌ పాశ్వాన్‌ స్పందించారు. ‘‘కేంద్ర రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉంటానో లేదోననే విషయం గతంలో కూడా చెప్పా. దానికి ఒక కారణం ఉంది. నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి బిహార్‌ ప్రజలే


కారణం. నేనేం చేసిన వారి కోసమే. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా బిహార్‌ను చూడాలని కోరుకుంటున్నా. మూడు సార్లు ఎంపీగా గెలిచిన తర్వాత దిల్లీలో కేంద్రమంత్రిగా ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయడం


అసాధ్యమని గ్రహించా. * అన్నావర్సిటీ విద్యార్థినిపై అత్యాచారం కేసులో జ్ఞానశేఖరన్‌కు జీవిత ఖైదు!  రాష్ట్రానికి మంచి జరగాలి. అవకాశం ఉంటే కచ్చితంగా పోటీ చేస్తా. కానీ, ఎన్నికల తర్వాత కూడా సీఎం


పదవిలో నీతీష్‌ కుమార్‌ ఉంటారని భావిస్తున్నా’’ అని చిరాగ్ పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్రతిపాదనను అధికారికంగా ప్రకటించేందుకు లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)


యోచిస్తోందని.. అందుకోసం త్వరలోనే కార్యనిర్వాహక సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే స్పందించిన చిరాగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన


వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 


Trending News

Aita under-16 tennis: pranav, amodini emerge champions

Bengaluru, Feb 19 : Rethin Pranav and Amodini Vijay, seeded No.4 in the boys and girls respectively, emerged champions i...

Ap news: ఏపీ వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో సరకుల పంపిణీ.. ప్రారంభించిన మంత్రులు

పిఠాపురంలో రేషన్‌ పంపిణీని ప్రారంభిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో స...

Tesla: భారత్‌లో తయారీకి టెస్లా ఆసక్తిగా లేదు: కేంద్ర మంత్రి కుమారస్వామి

Tesla | ఇంటర్నెట్‌డెస్క్‌: విద్యుత్తు వాహనాల తయారీ దిగ్గజం టెస్లా భారత్‌లో కార్ల తయారీకి సుముఖంగా లేదని కేంద్ర భారీ పరిశ...

Italy: ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన పర్యాటకులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటలీ (Italy)లోని సిసిలీ తూర్పు తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం (Mount Etna volcano) ఒక్కసారిగా బద్ద...

Ali: రాజేంద్ర ప్రసాద్‌ ఉద్దేశపూర్వకంగా అనలేదు: అలీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనపై రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad) ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని అలీ (Ali) అభిప్రాయపడ్డార...

Latests News

Chirag paswan: అలా అయితే బిహార్‌లో పోటీ చేస్తా: చిరాగ్‌ పాశ్వాన్‌

బిహార్‌ అభివృద్ధి కోసం తాను పని చేస్తున్నానని.. అవకాశం ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని కేంద్రమంత్రి చి...

Telangana Congress aims to unveil Rajiv Yuva Vikasam scheme on June 2

Newsletters ePaper Sign in HomeIndiaKarnatakaOpinionWorldBusinessSportsVideoEntertainmentDH SpecialsOperation SindoorNew...

Pawan kalyan: పవన్ కల్యాణ్ ఇంతమాట అనేశాడేంటి.. ఏపీ డిప్యూటీ సీఎం షాకింగ్ స్టేట్ మెంట్

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Universal pension scheme: పౌరులందరి కోసం సార్వత్రిక పెన్షన్‌ స్కీమ్‌.. కేంద్రం కసరత్తు..

Universal Pension Scheme: దేశంలోని పౌరులందరికీ పెన్షన్‌ ప్రయోజనాలు అందించేందుకు కేంద్రం కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోత...

Ponguru narayana | latest ponguru narayana - eenadu

అమరావతి, గుంటూరు, విజయవాడ కలిపి మెగాసిటీ భవిష్యత్తులో అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ అన్నీ కలిపి మెగాసిట...

Top