Viral video: ఈ వీడియో చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే.. స్పందించిన కేంద్ర మంత్రి

Eenadu

Viral video: ఈ వీడియో చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే.. స్పందించిన కేంద్ర మంత్రి"

Play all audios:

Loading...

చేతికొచ్చిన పంట వర్షంలో కొట్టుకుపోతుంటే ఓ రైతు భారీ వర్షాన్ని లెక్కచేయక పంటను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.   దిల్లీ: ఆరుగాలం


కష్టించి పండించిన రైతుకే పంట విలువ తెలుసు. అకాల వర్షాలతో పంట నీటిలో తడవడం, కొట్టుకెళ్లడం, మొలకలు రావడం మనం తరుచూ చూస్తూనే ఉంటాం. చేతికొచ్చిన పంట నేలపాలైతే ఆ రైతు బాధ వర్ణనాతీతం. మహారాష్ట్రలో


వర్షం నీటిలో కొట్టుకుపోతున్న పంటను కాపాడేందుకు ఓ రైతు పడిన కష్టం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (Shivraj Singh


Chouhan) స్పందించారు. బాధితుడితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.  మహారాష్ట్ర (Maharashtra)కు చెందిన రైతు గౌరవ్‌ పన్వార్‌ తన వేరుశనగ పంటను అమ్ముకోవడానికి వాషిమ్‌ మార్కెట్‌కు తీసుకొచ్చాడు.


అయితే భారీ వర్షం కురవడంతో పంట నీటిలో కొట్టుకొనిపోయింది. దీంతో రైతు గౌరవ్‌ భారీ వర్షంలో తడుస్తూనే కొట్టుకుపోతున్న వేరుశనగను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. ఈ హృదయవిదారక వీడియో చేస్తే


ఎవరి గుండె అయినా తరుక్కుపోవాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ విషయం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దృష్టికి రావడంతో.. స్వయంగా ఆయనే బాధిత


రైతుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  దీనికి సంబంధించి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘ఈ విషయం నన్ను చాలా బాధించింది. అయితే చింతించవద్దు. మహారాష్ట్ర


ప్రభుత్వం రైతుల సమస్యలపై చాలా సున్నితంగా వ్యవహరిస్తోంది. దీనిపై సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాను. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లిస్తాం. మీరు,


మీ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా చూస్తాం’’ అని కేంద్ర మంత్రి బాధిత రైతుకు భరోసా కల్పించారు. 


Trending News

‘Idhem Kharma’: TDP’s new campaign to take on YSRCP, highlight anti-incumbency

The Telugu Desam Party (TDP) is all set to announce a state-wide campaign called ‘Idhem Kharma’. The 45-day campaign wil...

'Pushpa 2 is also cinema...': Janhvi Kapoor fiercely DEFENDS Allu Arjun, Rashmika Mandanna's film amid row over...

Pushpa 2: The Rule, directed by Sukumar, stars Allu Arjun, Rashmika Mandanna, and Fahadh Faasil. It was released in thea...

Vedantam: kuchipudi’s original sathyabhama

He continued to portray other roles in various dance-dramas. As Gollabhama in ‘Gollakalapam’, Mohini in ‘Mohini Rukmanga...

Ponnam prabhakar | latest ponnam prabhakar - eenadu

కళాశాలల నుంచే కొత్త నాయకత్వం వస్తుంది దేశంలో, రాష్ట్రంలో కళాశాలల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, వాటినుంచే...

Vijay deverakonda | latest vijay deverakonda - eenadu

తీరిక దొరికితే... టూరే! పుస్తకాలు చదివినా, ప్రయాణించినా ప్రపంచం తెలుస్తుందని అంటారు. అందుకేనేమో చాలామంది తారలు పుస్తకాల ...

Latests News

Viral video: ఈ వీడియో చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే.. స్పందించిన కేంద్ర మంత్రి

చేతికొచ్చిన పంట వర్షంలో కొట్టుకుపోతుంటే ఓ రైతు భారీ వర్షాన్ని లెక్కచేయక పంటను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించాడు. ఈ వీడి...

Latest telugu news | breaking news telugu | telugu news today | news in telugu - eenadu

మీ ప్రశ్న అడగండి డా|| కవిత గూడపాటి ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్...

Arya meets Kamal Haasan, shows his work in 'Sarpatta Parambarai'

Actor Arya, who currently has three projects in his kitty, met Kamal Haasan on Wednesday at his residence in Chennai and...

Andhra pradesh news: ఫైళ్ల దహనం కేసులో విచారణ వేగవంతం.. మాధవరెడ్డిని ప్రశ్నిస్తున్న పోలీసులు

మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసులో విచారణను వేగవంతం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని పోల...

Chess: grandmasters bhakti and sethuraman clinch the gold for india

Bhakti and S P Sethuraman claimed the Asian Continental Women's and open chess championship. Bhakti Kulkarni (left)...

Top