Cyber attacks: పహల్గాం ఘటన తర్వాత 15 లక్షల సైబర్‌ దాడులు: మహారాష్ట్ర సైబర్ విభాగం

Eenadu

Cyber attacks: పహల్గాం ఘటన తర్వాత 15 లక్షల సైబర్‌ దాడులు: మహారాష్ట్ర సైబర్ విభాగం"

Play all audios:

Loading...

ముంబయి: భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ ఇండియాపై సైబర్‌దాడులు (Cyber Attacks) ఇంకా కొనసాగుతున్నట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం తాజాగా వెల్లడించింది. ఈ క్రమంలోనే పహల్గాం


ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు భారత్‌లో 15 లక్షల సైబర్‌ దాడులు చోటుచేసుకున్నట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. వీటిలో 150 విజయవంతమైనట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్‌తోపాటు ఇతర దేశాలకు


చెందిన హ్యాకింగ్ గ్రూపుల నుంచి ఈ దాడులు జరిగినట్లు వెల్లడించారు. * భారత్- పాక్ ఉద్రిక్తతలు తగ్గుముఖం.. ఆ ప్రాంతాల్లో విమాన సర్వీసులు షురూ! ఏప్రిల్ 22 తర్వాత భారీస్థాయిలో డిజిటల్ దాడులు


పెరిగాయని, భారత వెబ్‌సైట్లు, పోర్టల్స్‌ను లక్ష్యంగా చేసుకొని బంగ్లాదేశ్‌, పశ్చిమాసియా, ఇండోనేసియా హ్యాకర్లు వీటికి పాల్పడినట్లు మహారాష్ట్ర సైబర్‌ నేరాల నియంత్రణ విభాగం సీనియర్‌ అధికారి


మీడియాకు తెలిపారు. ‘‘హ్యాకర్లు ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన సమాచారాన్ని దొంగిలించారు. విమానయానం, మున్సిపల్ సిస్టమ్స్‌, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను లక్ష్యంగా


చేసుకొని హ్యాకర్స్‌ దాడులు చేశారు. భారత్‌-పాక్‌ కాల్పుల విరమణ తర్వాత కూడా ప్రభుత్వ వెబ్‌సైట్‌పై సైబర్‌ దాడులు పూర్తిస్థాయిలో తగ్గలేదు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఇండోనేసియా, మొరాకో,


పశ్చిమాసియా దేశాల నుంచి సైబర్‌ దాడులు ఎదురవుతూనే ఉన్నాయి’’ అని సదరు అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో సైబర్ డిపార్ట్‌మెంట్‌ నోడల్ కార్యాలయంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో


ఇది పనిచేస్తూ.. సైబర్ నేరాల దర్యాప్తు, భద్రతా నిర్వహణ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు రాష్ట్రంలో సైబర్‌ నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. సైబర్‌ దాడులకు గురైతే


బాధితులు 1945, 1930 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


Trending News

Ktr: హరీశ్‌రావుతో కేటీఆర్‌ భేటీ.. తాజా పరిణామాలపై సుదీర్ఘ చర్చ

హైదరాబాద్‌: భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌.. మాజీ మంత్రి హరీశ్‌రావు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. అనార...

Saraswati river pushkaralu: నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు.. మీకివి తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు నేటి నుంచి ఈ నెల 26 వరకు జరగనున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ...

Mulugu: ములుగు జిల్లాలో పేలిన మందుపాతర.. ముగ్గురు పోలీసుల మృతి

వాజేడు: ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతిచెందినట్లు సమ...

Hydra: కూకట్‌పల్లిలో ఆక్రమణలను కూల్చేసిన హైడ్రా.. ప్లాట్ల యజమానుల హర్షం

కూకట్‌పల్లి హైదర్‌నగర్‌ డైమండ్ ఎస్టేట్ లేఅవుట్‌ను ఆక్రమణదారుల చెర నుంచి హైడ్రా (Hydra) విడిపించింది. ఇక్కడ ప్లాట్లను కొన...

Operation sindoor: పంజాబ్‌ - జమ్మూలో పాక్‌ క్షిపణి శకలాలు లభ్యం

Operation Sindoor: భారత్‌లోని సాధారణ ప్రజలనే లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్‌ దాడులు చేస్తోంది. పంజాబ్, జమ్మూలో క్షిపణి శక...

Latests News

Cyber attacks: పహల్గాం ఘటన తర్వాత 15 లక్షల సైబర్‌ దాడులు: మహారాష్ట్ర సైబర్ విభాగం

ముంబయి: భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ ఇండియాపై సైబర్‌దాడులు (Cyber Attacks) ఇంకా కొనసాగుతున్నట్ల...

London | latest london - eenadu

లండన్‌లో మన వంటలకి అవార్డు! కోనసీమ లక్ష్మీచారు, రాయలసీమ ఉగ్గాణి, తెలంగాణ సర్వపిండి... ఇవన్నీ ఆయా ప్రాంతాలకే పరిమితమైన ఆహ...

Pm modi: 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగుపెడతాడు: ప్రధాని మోదీ

దిల్లీ : అంతరిక్షంలో భారత్‌ ఎన్నో విజయాలు సాధిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ‘గ్లోబల్‌ స్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన...

Smartphone | latest smartphone - eenadu

6,000MAH బ్యాటరీతో రియల్‌మీ 14ఎక్స్‌.. ధర ఎంతంటే? Realme 14x: రియల్‌మీ కొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. రెండు వేరియంట్లు, ...

Apecet: ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల

ఏపీఈసెట్‌ (APECET) ఫలితాలను అనంతపురం జేఎన్‌టీయూ గురువారం విడుదల చేసింది. By Features Desk Updated : 15 May 2025 17:10 IS...

Top