Harsh goenka: సామాన్యుడి ప్రాణం విలువ చాయ్‌ కప్పు కంటే చౌకనా?.. ‘తొక్కిసలాట’పై హర్ష్‌ గోయెంకా పోస్ట్‌

Eenadu

Harsh goenka: సామాన్యుడి ప్రాణం విలువ చాయ్‌ కప్పు కంటే చౌకనా?.. ‘తొక్కిసలాట’పై హర్ష్‌ గోయెంకా పోస్ట్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్సీబీ విజయోత్సవాల వేళ సంభవించిన తొక్కిసలాట ఘటన పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదానికి కర్ణాటక ప్రభుత్వం వైఫల్యమే కారణమంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలపై


ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా (Harsh Goenka) చేసిన పోస్ట్‌ చర్చనీయాంశమైంది. గతంలో జరిగిన పలు తొక్కిసలాట (Bengaluru Stampede) ఘటనలను ప్రస్తావిస్తూ.. సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా? అని


ఆయన ప్రశ్నించారు. ‘‘దిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. కుంభమేళాలో తొక్కిసలాట.. బెంగళూరులో తొక్కిసలాట.. ఈ ఘటనలో డజన్లకొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఇంతవరకూ ఎవరూ బాధ్యత తీసుకోలేదు.


రాజీనామాలు చేయలేదు. పాఠాలు నేర్చుకోలేదు. మన దేశంలో సామాన్యుడి ప్రాణాలు అమూల్యమైనవి కావా? అంత విలువ లేదా? వారి ప్రాణం విలువ కప్‌ చాయ్‌ కంటే చౌకగా మారింది. ఇలాంటి ఘటనల తర్వాత అంతా యథావిధిగానే


ఉంటోంది. ఏమీ మారట్లేదు’’ అని గోయెంకా తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. హృదయం ముక్కలైన ఎమోజీని జత చేశారు. * ఫ్రీ టికెట్లు.. గేట్లు మూసివేత.. తొక్కిసలాటకు కారణాలివేనా? ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట


చర్చకు దారితీసింది. దీనిపై పలువురు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ‘‘ఇది చాలా దురదృష్టకర ఘటన. నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలి. అయితే, అంతకంటే ముందు సామాన్యులు కూడా బాధ్యతగా


వ్యవహరించాల్సిన అవసరం ఉంది’’ అని కొందరు రాసుకొచ్చారు. సామాన్యుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని మరికొందరు అభిప్రాయపడ్డారు. బెంగళూరు తొక్కిసలాటలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయిన


సంగతి తెలిసిందే. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బెంగళూరు జట్టు (RCB) ఐపీఎల్‌ కప్‌ను సొంతం చేసుకోవడంతో చిన్నస్వామి స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. అంచనాకు మించి జనం రావడంతో వారిని నియంత్రించడం


పోలీసుల వల్ల కాలేదు. అదే సమయంలో వర్షం కురవడంతో తొక్కిసలాట మొదలై పలువురు మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు.


Trending News

RBI vs Modi government: Urjit Patel to meet Arun Jaitley today at FSDC meeting

Other financial sector regulators will also be present at the meeting.Amidst the friction between the Reserve Bank of In...

నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్‌ (29/05/2025)

Published : 29 May 2025 06:38 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE సంక్షిప్త వార్తలు - చిత్ర వార్...

Murali Gopy's role in 'Kaattu', set in the 1970s

Murali Gopy’s Kaattu will have him play the role of Chellappan. The character that the star is playing in the movie was ...

Viral : ఈ చెక్కను ఇంట్లో ఉంచితే పాములు, తేళ్లు అస్సలు రావు.. మీరు సేఫ్‌గా ఉంటారు

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Isro: అంతరిక్షంలో అంకురోత్పత్తి.. ఇస్రో అద్భుత ఘనత

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల స్పేడెక్స్‌ (Spadex Mission) ప్రయోగం చేపట్టిన ఇస్రో మరో అద్భుత ఘనత సాధించింది.  ‘కంపాక్ట్‌ రీసె...

Latests News

Harsh goenka: సామాన్యుడి ప్రాణం విలువ చాయ్‌ కప్పు కంటే చౌకనా?.. ‘తొక్కిసలాట’పై హర్ష్‌ గోయెంకా పోస్ట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్సీబీ విజయోత్సవాల వేళ సంభవించిన తొక్కిసలాట ఘటన పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదానికి కర్ణాటక ప్ర...

Padma awards | latest padma awards - eenadu

PADMA AWARDS 2024: వెంకయ్యనాయుడు, చిరంజీవిలకు పద్మవిభూషణ్‌ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీనటుడు క...

Subramanya Swamy: నాగుల చవితి రోజు ఇక్కడ సుబ్రమణ్య స్వామిని దర్శిస్తే సంతానం కలుగుతుందట!

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Malavika Mohanan excited to work with Rajinikanth in 'Petta'

Actress Malavika Mohanan, daughter of renowned cinematographer TU Mohanan, makes her Tamil debut opposite superstar Raji...

Bharathiraja, Sasikumar team up for Suseenthiran’s new film

Filmmaker Suseenthiran, known for films such as Naan Mahan Alla and Pandiya Nadu, is all set to join hands with veteran ...

Top