Sikkim: మిలిటరీ క్యాంప్‌పై పడిన కొండచరియలు.. ముగ్గురు మృతి
Sikkim: మిలిటరీ క్యాంప్‌పై పడిన కొండచరియలు.. ముగ్గురు మృతి"
Play all audios:
Sikkim | ఇంటర్నెట్‌డెస్క్: ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష బీభత్సం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా సిక్కింలోని ఛటేన్ అనే ప్రదేశంలో మిలిటరీ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు భద్రతా
సిబ్బంది మరణించగా.. మరో ఆరుగురి ఆచూకీ గల్లంతైంది. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు సోమవారం ధ్రువీకరించారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ముగ్గురి
మృతదేహాలను దళాలు గుర్తించాయి. మరో నలుగురు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇక ఆచూకీ గల్లంతైన వారిని కాపాడేందుకు సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈశాన్య భారత్‌లో
రెడ్అలర్ట్.. ఈశాన్య భారత్‌లోని రాష్ట్రాల్లో నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని
పేర్కొంది. దీంతోపాటు ఉరుములు, పిడుగులు పడొచ్చని హెచ్చరించింది. అస్సాం, మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాల్యాండ్, మేఘాలయలో అతి భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించింది.
పశ్చిమబెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇక జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణ, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
ఉందని చెప్పింది. * ఈశాన్య రాష్ట్రాల్లో కుంభవృష్టి ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు తొందరగా రావడం, బంగ్లాదేశ్, మేఘాలయాపై అల్పపీడనం ఏర్పడటం వంటి కారణాలతో ఈశాన్య రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు
పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అస్సాంలో ఆదివారం 7 ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. 20కి పైగా జిల్లాల్లో వరద జలాలతో సుమారు 4 లక్షల మంది ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
గువాహటిలో శనివారం 24 గంటల్లోనే 11 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. గత 67 ఏళ్లలో మే నెలలో ఒక్క రోజులో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే కావడం గమనార్హం. ఇక త్రిపుర రాజధాని అగర్తలలో ఎడతెగని
వర్షంతో ఓ వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడి చనిపోయాడు. మూడు గంటల వ్యవధిలోనే 20 సెం.మీ.ల రికార్డు వర్షపాతం నమోదైనట్లు అధికారులు ఆదివారం తెలిపారు.
Trending News
Banyan tree: భారీ మర్రి చెట్టు.. ఇంతవరకు ఎవ్వరూ ఆ పని చేయలేకపోయారు!Reported by: Published by: Last Updated:September 07, 2024 10:26 AM IST ఇక్కడ మల్లన్న జాతరకు భక్తులు పెద్ద ఎత్తున అంగరంగ...
Ipl 2025: శ్రేయాస్‌ను పట్టించుకోని kkr.. అయ్యర్‌పై ఆ ఫ్రాంచైజీ కన్ను..!CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Actress: ఒకే ఒక్క ఫ్లాప్‌తో సినిమాలకు గుడ్‌బై.. బిలీనియర్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిన బ్యూటీ క్వీన్* బాక్సాఫీస్ వద్ద బోల్తా 83 మూవీ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా. దీపికా పదుకొనే నిర్మించింది. ఈ మూవీలో రణ్వీర్ సింగ్...
Pema Khandu government in Arunachal passes floor testItanagar: The four-day-old Pema Khandu government in Arunachal Pradesh today passed the floor test in the Assembly with ...
Icc schedule: టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇలాగేనా ఉండేది..? ఐసీసీపై కెప్టెన్ ఫైర్..!Published by: Last Updated:June 27, 2024 4:21 PM IST ICC SCHEDULE: సెమీఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచాక అఫ్గాన్ కెప్టెన్ రష...
Latests News
Sikkim: మిలిటరీ క్యాంప్‌పై పడిన కొండచరియలు.. ముగ్గురు మృతిSikkim | ఇంటర్నెట్‌డెస్క్: ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష బీభత్సం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా సిక్కింలోని ఛటేన్ అనే ప్రదేశంలో మ...
Ipl 2024: ఐపీఎల్ కోసం ఎయిర్టెల్ అదిరే ప్లాన్.. తక్కువ ధర, భారీగా డేటాCNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Murali Gopy's role in 'Kaattu', set in the 1970sMurali Gopy’s Kaattu will have him play the role of Chellappan. The character that the star is playing in the movie was ...
Ejs interviews: ఈనాడు జర్నలిజం స్కూలు ఇంటర్వ్యూలకు 228 మంది ఎంపిక.. ఇంటర్వ్యూ తేదీలివీEJS Interviews: ఈనాడు జర్నలిజం స్కూలు ఇంటర్వ్యూలకు 228 మంది ఎంపికయ్యారు. వారి ఇంటర్వ్యూ తేదీలు ఇవీ! By Features Desk Pub...
Akhil Akkineni’s next to be directed by Parasuram or Bhaskar?Akhil Akkineni is desperately in need of a big hit with his previous films failing at the box office consecutively. Whil...