Boycott turkey: తుర్కియే, అజర్‌బైజాన్‌లకు.. భారీగా తగ్గిన వీసా దరఖాస్తులు
Boycott turkey: తుర్కియే, అజర్‌బైజాన్‌లకు.. భారీగా తగ్గిన వీసా దరఖాస్తులు"
Play all audios:
తుర్కియే, అజైర్‌బైజాన్‌లకు వచ్చే వీసా దరఖాస్తుల్లో ఇటీవల 42శాతం తగ్గుదల కనిపించినట్లు వీసా ప్రాసెసింగ్ సంస్థ అట్లీస్ వెల్లడించింది. ఇంటర్నెట్ డెస్క్: ‘ఆపరేషన్ సిందూర్’ (Operation
Sindoor) సమయంలో పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన తుర్కియే, అజర్‌బైజాన్‌లపై మన దేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా దేశాలకు వెళ్లేందుకు మన పర్యాటకులు
అనాసక్తి (Boycott Turkey) చూపిస్తున్నట్లు కనబడుతోంది. ఆ రెండు దేశాలకు వీసా దరఖాస్తుల్లో ఇటీవల 42శాతం తగ్గుదల కనిపించినట్లు వీసా ప్రాసెసింగ్ సంస్థ అట్లీస్ వెల్లడించింది. వీసా ప్రక్రియ
మధ్యలో ఉన్నప్పటికీ అనేక మంది విరమించుకున్నట్లు తెలిపింది. తుర్కియే, అజర్‌బైజాన్‌లకు ఈసారి భారీ స్థాయిలో పర్యాటకుల తాకిడి ఉంది. అట్లీస్ (Atlys) ప్రకారం.. జనవరి-మార్చి కాలంలో గత ఏడాది కన్నా
దరఖాస్తుల సంఖ్య 64శాతం పెరిగినట్లు అంచనా. అయితే, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు దీనిపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత దిల్లీ, ముంబయి వంటి మెట్రో నగరాల నుంచి
తుర్కియే, అజర్‌బైజాన్‌లకు ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ప్రాంతాల నుంచి వచ్చే దరఖాస్తుల్లో 53శాతం తగ్గగా.. ఇందౌర్, జైపుర్ వంటి టైర్- 2 నగరాల నుంచి ఇవి తగ్గుముఖం పట్టాయి.
ఫ్యామిలీ ట్రిప్స్ సహా గ్రూపు వీసా దరఖాస్తుల్లో 49శాతం క్షీణత కనిపించగా.. ఒంటరిగా వెళ్లే వారిలోనూ 27శాతం తగ్గుదల కనిపించింది. * ‘బాయ్‌కాట్ తుర్కియే’ ఎఫెక్ట్.. 250% పెరిగిన క్యాన్సలేషన్లు!
25 నుంచి 34ఏళ్ల వయసు కలిగిన పర్యాటకులు తమ నిర్ణయాన్ని వేగంగా మార్చుకున్నట్లు అట్లీస్ వెల్లడించింది. తుర్కియేకు వచ్చిన వీసా (Visa) దరఖాస్తుల్లో 70శాతం విరమించుకున్నట్లు తెలిపింది. మహిళలు
పూర్తిగా తమ పర్యటనను మార్చుకున్నారని, ప్రత్యామ్నాయంగా వియత్నాం, ఇండోనేషియా, ఈజిప్టు దేశాలను ఎంచుకుంటున్నారని పేర్కొంది. ఇటీవల ఈ దరఖాస్తులు 31శాతం పెరిగాయి. ఒకప్పుడు బాకు, ఇస్తాంబుల్ వైపు
ఆలోచించిన వాళ్లు ప్రశాంతమైన, రాజకీయంగా తటస్థంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టారు. అటువంటి ప్రదేశాలకు వెళ్లవద్దని చెప్పనవసరం లేదని, అందుబాటులో ఉన్న సమాచారంతో పర్యాటకులే సొంతగా నిర్ణయాలు
తీసుకొని ప్రత్యామ్నాయాలు ఎంచుకుంటున్నారని తాజా నివేదిక వెల్లడించింది.
Trending News
20 లక్షలు దాటిన కరోనా టెస్టులుసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటు కోవిడ్ నిర్ధా...
Team india | latest team india - eenaduMOHAMMED SIRAJ: ‘ఆటో నడుపుకో’ అన్నారు! మహమ్మద్ సిరాజ్... ఒక ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఏకైక భారతీయ బౌలర్. గణాంకాల్ల...
Vedantam: kuchipudi’s original sathyabhamaHe continued to portray other roles in various dance-dramas. As Gollabhama in ‘Gollakalapam’, Mohini in ‘Mohini Rukmanga...
Allu arjun's arrest, nayanthara vs dhanush, poonam pandey's death hoax: 10 controversies that rocked showbiz in 2024Hema Committee Report, IC 814 The Kandahar Hijack row, and Darshan and Renukaswamy murder case were some of the other ma...
‘Idhem Kharma’: TDP’s new campaign to take on YSRCP, highlight anti-incumbencyThe Telugu Desam Party (TDP) is all set to announce a state-wide campaign called ‘Idhem Kharma’. The 45-day campaign wil...
Latests News
Boycott turkey: తుర్కియే, అజర్‌బైజాన్‌లకు.. భారీగా తగ్గిన వీసా దరఖాస్తులుతుర్కియే, అజైర్‌బైజాన్‌లకు వచ్చే వీసా దరఖాస్తుల్లో ఇటీవల 42శాతం తగ్గుదల కనిపించినట్లు వీసా ప్రాసెసింగ్ సంస్థ అట్లీస్ వ...
Operation sindoor: ఉగ్రవాద వ్యాప్తికి సహకరించే వారికి సరైన సమాధానం ‘ఆపరేషన్ సిందూర్’: మోదీOperation Sindoor | ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌లో ఉగ్రవాదం వ్యాప్తి చేసేవారికి సరైన సమాధానం ఆపరేషన్ సిందూర్ అని ప్రధాని ...
Name Astrology: మీ పేరు M అక్షరంతో మొదలవుతుందా..? మీ ప్లస్, మైనస్ పాయింట్స్ ఇవేName Astrology: మీ పేరు M అక్షరంతో మొదలవుతుందా..? మీ ప్లస్, మైనస్ పాయింట్స్ ఇవేPublished by:Siva Nandurinews18-teluguLas...
Sonu Nigam Shares His Last Conversation With Aadesh ShrivastavaSinger Sonu Nigam has shared his last conversation with the late Bollywood music composer Aadesh Shrivastava, who lost t...
Congress condemns attack on Sudheendra KulkarniBoth Chavan and leader of opposition in state assembly Radhakrishna Vikhe-Patil blamed Shiv Sena for its double standard...