Travelling to us: అమెరికాకు ప్రయాణమా? ఈ వస్తువులను లగేజీలో తీసుకెళ్లొద్దు
Travelling to us: అమెరికాకు ప్రయాణమా? ఈ వస్తువులను లగేజీలో తీసుకెళ్లొద్దు"
Play all audios:
Travelling To US | ఇంటర్నెట్ డెస్క్: విమానాల్లో ప్రమాదాల నివారణే లక్ష్యంగా అమెరికా రవాణా భద్రతా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడంతో పాటు భద్రతా చర్యలను
మరింత కట్టడి చేసేందుకు ట్రాన్స్‌పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (TSA), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA)తో కలిసి కొత్త నియమాల్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అమెరికా విమానాల్లో
చెక్- ఇన్ లగేజీలో లిథియం బ్యాటరీతో నడిచే ఏడు రకాల వస్తువులపై నిషేధం విధించారు. ఇటీవల వాణిజ్య విమానాల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిని
క్యారీ-ఆన్ లగేజీలో తీసుకెళ్లే వెసులుబాటు ఉంది. నిషేధం వీటిపైనే.. * పవర్ బ్యాంక్‌లు * సెల్‌ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ కేస్‌లు * స్పేర్ లిథియం- అయాన్ బ్యాటరీలు * స్పేర్ లిథియం- మెటల్
బ్యాటరీలు * సెల్‌ఫోన్ బ్యాటరీలు * ల్యాప్‌ట్యాప్ బ్యాటరీలు * ఎక్స్‌టర్నల్ బ్యాటరీ ప్యాక్‌లు, పోర్టబుల్ రీఛార్జులు * భారీ నష్టాల్లో సూచీలు: సెన్సెక్స్ 873 పాయింట్లు డౌన్.. 24,700 దిగువకు
నిఫ్టీ లిథియం బ్యాటరీలకు వేడెక్కే స్వభావం ఉంటుందని ఎఫ్‌ఏఏ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. దీనివల్ల ‘థర్మల్ రన్ అవే’ అనే ప్రమాదకరమైన రసాయన రియాక్షన్‌కు కారణమవుతుందని వెల్లడించింది. ఓవర్
ఛార్జింగ్, సరిగ్గా ప్యాక్ చేయకపోవడం లేదా తయారీలో లోపాల కారణంగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని తెలిపింది. ముఖ్యంగా విమానంలోని కార్గోలో ఉన్నప్పుడు ప్రమాదానికి ఆస్కారం ఎక్కువ, దీనివల్ల ఇతర
బ్యాటరీలకు వేగంగా వ్యాపించి తీవ్రమైన అగ్ని ప్రమాదం సంభవించొచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న వస్తువుల్ని తీసుకెళ్లేందుకు వీలుండదు. వాటిని క్యారీ- ఆన్ లగేజీలో మాత్రమే తీసుకెళ్లాల్సి
ఉంటుంది. 2025 జనవరిలో ఎయిర్ బూసాన్ ఫ్లైట్ 391లో పవర్ బ్యాటరీ కారణంగా వ్యాపించిన మంటల్లో చిక్కుకుని ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. 2024 నవంబర్‌లో విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికుడి
ఫోన్ పేలడంతో సిబ్బంది తోటి ప్రయాణికుల్ని అప్రమత్తం చేశారు. దీంతో విమానంలో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి ప్రమాదాల నేపథ్యంలో లిథియం అయాన్ బ్యాటరీతో రూపొందించిన ఏడు
వస్తువులను లగేజీలో తీసుకెళ్లడంపై బ్యాన్ విధించడం గమనార్హం.
Trending News
Real cast away: 32 ఏళ్లుగా.. ఒంటరిగా.. దీవిలో జీవించిన 81 ఏళ్ల పెద్దాయనPublished by: Last Updated:April 28, 2021 12:05 PM IST REAL CAST AWAY: మనిషి సంఘజీవి. ఒంటరిగా బతకడం కష్టం. మరి అతను ఎలా ...
Pawan kalyan - shruti hassan: పవన్ కల్యాణ్ ఆ విషయంలో తోపు అంటున్న శ్రుతి!Published by: Last Updated:February 27, 2021 9:59 PM IST PAWAN KALYAN - SHRUTI HASSAN: మీరేమైనా చెప్పండి! ఎన్నయినా చెప్...
Indus water treaty: ఒమర్ vs మెహబూబా.. ‘తుల్‌బుల్’పై మాటల యుద్ధంఇంటర్నెట్ డెస్క్: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి స...
Talasani srinivas yadav | latest talasani srinivas yadav - eenaduఆ పరిశ్రమ తలసాని కుటుంబానిదే.. మంత్రి సీతక్క ఆరోపణ నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ ఇథనాల్ పరిశ్రమ భారాసకు చెందిన మాజీ మంత...
Kl rahul: రాహుల్ ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడం జట్టుకు బలం: భారత బ్యాటింగ్ కోచ్దిల్లీ: టీమ్ ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్ష్ కోటక్ ప్రశంసల జల్లు కురిపించారు. అతను ఆర...
Latests News
Travelling to us: అమెరికాకు ప్రయాణమా? ఈ వస్తువులను లగేజీలో తీసుకెళ్లొద్దుTravelling To US | ఇంటర్నెట్ డెస్క్: విమానాల్లో ప్రమాదాల నివారణే లక్ష్యంగా అమెరికా రవాణా భద్రతా సంస్థ కీలక నిర్ణయం తీస...
Upcoming ipos: ఐపీఓ క్యాలెండర్: నాలుగు లిస్టింగ్‌లు.. ఒక్కటే సబ్‌స్క్రిప్షన్Upcoming IPOs: వచ్చే వారంలో 4 కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. ఎస్‌ఎంఈ విభాగం నుంచి ఓ సంస్థ మార్కెట్...
Stock market: భారీ లాభాల్లో సూచీలు.. 25 వేల పైకి నిఫ్టీ.. కారణాలు ఇవేStock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ...
Vladimir putin | latest vladimir putin - eenaduరష్యా, ఉత్తర కొరియాలపై ట్రంప్ సుంకాల్లేవ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల నుంచి రష్యా, ...
Operation sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధానిమోదీదిల్లీ: ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పాకిస్థాన్‌లోని ...