Google ai mode: గూగుల్‌లో కొత్తగా ఏఐ మోడ్.. ‘ఫీలింగ్ లక్కీ’కి గుడ్‌బై చెప్పేసినట్లేనా?
Google ai mode: గూగుల్‌లో కొత్తగా ఏఐ మోడ్.. ‘ఫీలింగ్ లక్కీ’కి గుడ్‌బై చెప్పేసినట్లేనా?"
Play all audios:
Google AI Mode: గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో కొత్తగా ఏఐ మోడ్ రాబోతోంది. దీంతో ఎన్నాళ్ల నుంచో ఉన్న ‘ఫీలింగ్ లక్కీ’ బటన్‌కు గుడ్‌బై చెప్పేసినట్లే అని తెలుస్తోంది. Google AI Mode | ఇంటర్నెట్
డెస్క్: సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ కొత్త సదుపాయాన్ని పరీక్షిస్తోంది. తన సెర్చింజన్ హోమ్‌పేజీలో ‘ఏఐ మోడ్’ను (AI mode) జోడించనుంది. గూగుల్ హోమ్‌పేజీలోని వేర్వేరు ప్రదేశాల్లో ఈ బటన్
కనిపించినట్లు పలువురు యూజర్లు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. గూగుల్ సెర్చింజన్ హోమ్‌పేజీలో గూగుల్ సెర్చ్‌తో పాటు ‘ఐయామ్ ఫీలింగ్ లక్కీ’ (‘I'm Feeling Lucky’) అనే మరో బటన్ కూడా
దర్శనమిస్తుంటుంది. ఆ బటన్ స్థానంలో ఏఐ మోడ్‌ను పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గూగుల్ సెర్చింజిన్ ప్రారంభం నుంచి ‘‘I'm Feeling Lucky’’ బటన్ గూగుల్ అందుబాటులో ఉంది. గూగుల్
సెర్చ్‌లో ఏదైనా పదం సెర్చ్ చేసి ఈ బటన్ క్లిక్ చేస్తే వేర్వేరు సెర్చ్ రిజల్ట్స్ కాకుండా నేరుగా సంబంధిత వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. ఉదాహరణకు ‘Eenadu’ అని సెర్చ్ చేసి ఈ బటన్ క్లిక్
చేస్తే నేరుగా ఈనాడు.నెట్ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతారు. మీ సెర్చ్‌ను వేగవంతం చేయడానికి ఈ బటన్‌ను తీసుకొచ్చారు. సెర్చ్ బాక్స్‌లో ఏ కీవర్డ్ ఎంటర్ చేయకుడా ఈ బటన్ క్లిక్ చేస్తే గూగుల్
డూడుల్ పేజీ ప్రత్యక్షమవుతుంది. * ప్రైమ్ వీడియోలో ఇక యాడ్స్.. వద్దనుకుంటే అదనంగా చెల్లించాల్సిందే! చాలా ఏళ్లుగా సెర్చ్ ఇంజిన్ హోమ్‌పేజీలో భాగంగా ఉన్న ఈ బటన్ స్థానంలో ‘ఏఐ మోడ్’
చాలామందికి తాజాగా కనిపించినట్లు తెలుస్తోంది. దీన్ని ప్రయోగాత్మకంగా గూగుల్ పరీక్షిస్తున్నట్లు అర్థమవుతోంది. అంటే ఇకపై ఏదైనా కీవర్డ్ ఎంటర్ చేసి ‘ఏఐ మోడ్’ ఎంచుకుంటే సంబంధిత వెబ్సైట్
కాకుండా ఏఐ సాయంతో సమాధానం ఇవ్వనుందన్నమాట. గూగుల్ ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్న విషయాన్ని సంస్థ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. అయితే, పూర్తిస్థాయిలో రోల్ అవుట్ చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని
చెప్పారు. త్వరలో దీనిపై మరింత స్పష్టత రానుంది.
Trending News
Video clip from pawan kalyan’s 'katamarayudu' leaked onlineSeveral actors have faced the same problem. Incidentally, a clipping of Pawan’s _Atharintiki Daredi_ was also out before...
‘vaarthakal ithuvare’ review: vinay forrt's rural drama is let down by bad writingA village setting, some tunes of rural flavour, some paddy fields, a toddy shop and villagers who know each other so wel...
Dsp | ప్రొడ్యూసర్స్‌కి ఇచ్చిపడేసిన డీఎస్పి..CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Tirumala: ఉగాది పర్వదినం నాడు వైకుంఠాన్ని తలపిస్తున్న తిరుమల శ్రీవారి ఆలయంCNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Vishesham review: chinnu chandni-anand madhusoodhanan elevate a predictable family dramaWhen _Vishesham_ opens, we see a distraught Sujith Bhakthan (Anand Madhusoodhanan) struggling to get over his short marr...
Latests News
Google ai mode: గూగుల్‌లో కొత్తగా ఏఐ మోడ్.. ‘ఫీలింగ్ లక్కీ’కి గుడ్‌బై చెప్పేసినట్లేనా?Google AI Mode: గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో కొత్తగా ఏఐ మోడ్ రాబోతోంది. దీంతో ఎన్నాళ్ల నుంచో ఉన్న ‘ఫీలింగ్ లక్కీ’ బటన్‌కు...
Kamal haasan | latest kamal haasan - eenaduహిందీని రుద్దకుండా రాష్ట్రాలకు అండగా నిలుస్తా.. ఎంఎన్ఎం అధినేత కమల్‌హాసన్ హిందీని బలవంతంగా రుద్దకుండా తమిళనాడుతో పాటు ...
Valentine's day: సింగిల్ కింగ్స్ డోంట్ వర్రీ.. ప్రేమికుల రోజును ఇలా సెలబ్రేట్ చేసుకోండి..బెస్ట్ ఫ్రెండ్‌తో డేట్ బెస్ట్ ఫ్రెండ్ అంటే బాగా తెలిసిన, మద్దతు ఇచ్చే, బేషరతుగా ప్రేమించే వ్యక్తి. ప్రేమికుల రోజున వారిత...
Viral video: ఈ బైక్ ఉంటే కారుతో పని లేదు.. ఎండ, వాన, ట్రాఫిక్ సమస్యే ఉండదుPublished by: Last Updated:June 25, 2024 2:04 PM IST VIRAL VIDEO: వర్షాకాలంలో బైక్ రైడింగ్ చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా...
Revanth reddy: ‘పద్మ’ పురస్కారాల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష: సీఎం రేవంత్‌రెడ్డిహైదరాబాద్: పద్మ పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం...