Flight operations: చల్లారిన ఉద్రిక్తతలు.. 32 విమానాశ్రయాలు రీఓపెన్
Flight operations: చల్లారిన ఉద్రిక్తతలు.. 32 విమానాశ్రయాలు రీఓపెన్"
Play all audios:
దిల్లీ: భారత్-పాక్ (India-Pakistan) నడుమ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ భారత్‌లోని 32 విమానాశ్రయాలను మే 15 వరకు మూసివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇరుదేశాల
మధ్య ఉద్రిక్తతలు తొలగిపోవడంతో విమానాశ్రయాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు (Airports Reopen) ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (Airport Authorities of India) ప్రకటించింది. తొలుత ఈనెల 15 వరకు
వాటిని మూసివేయాలని భావించినప్పటికీ పరిస్థితులు మెరుగుపడటంతో వాటిని తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. పౌర విమానయాన కార్యకలాపాలు వెంటనే అందుబాటులోకి వస్తాయని.. ఈవిషయాన్ని దృష్టిలోఉంచుకొని
ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విమానాల సేవలు, వివరాలకు సంబంధించిన ఇతర విషయాలు తెలుసుకోవడానికి ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్‌లను పర్యవేక్షించాలని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా
సూచించింది. * ప్రధాని నివాసంలో సీడీఎస్, త్రివిధ దళాల అధిపతుల భేటీ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్‌లోని వివిధ ఉగ్రస్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాడులు చేయడంతో ఇరుదేశాల
మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో సరిహద్దులకు దగ్గరగా ఉన్న దాడులు జరిగేందుకు అవకాశమున్న చండీగఢ్, శ్రీనగర్, అమృత్‌సర్, లూథియానా, భుంటార్, కిషన్‌గఢ్, పటియాలా, శిమ్లా,
ధర్మశాల, భఠిండా, జైసల్మేర్, జోధ్‌పుర్, లేహ్, బికనేర్, పఠాన్‌కోట్, జమ్మూ, జామ్‌నగర్, రాజ్‌కోట్, భుజ్ తదితర విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. ఇటీవల
ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంతో సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో ఈ సేవలను తిరిగి పునరుద్ధరించింది.
Trending News
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్ శుద్ధి ప్...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Royal challengers bengaluru | latest royal challengers bengaluru - eenaduముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్ జట్టు.. విల్‌జాక్స్, రికెల్‌టన్, కార్బిన్ బాష్ స్థ...
Kuldeep yadav | latest kuldeep yadav - eenaduఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు: రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్, ఫైనల్స్‌లో భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ...
Army: ఆర్మీ యూనిఫామ్ అక్రమ తరలింపు.. మిలిటరీ ఇంటెలిజెన్స్ సాయంతో దాడులు..ఇంటర్నెట్‌డెస్క్: సైన్యానికి యుద్ధ రంగంలో ఉపయోగపడేలా ప్రత్యేకంగా డిజిటల్ టెక్నాలజీ సాయంతో సిద్ధం చేసిన యూనిఫామ్‌లను ప...
Latests News
Flight operations: చల్లారిన ఉద్రిక్తతలు.. 32 విమానాశ్రయాలు రీఓపెన్దిల్లీ: భారత్-పాక్ (India-Pakistan) నడుమ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ భారత్‌లోని 32 విమానాశ్రయాలను మే 15 వరకు మూ...
Hindu seer rambhadracharya seeks pok as guru dakshina from army chief dwivediBHOPAL: Padma Vibhushan Jagadguru Rambhadracharya, one of the most prominent Hindu seers and spiritual leaders, has soug...
Video: revanth reddy sworn in as cm of telangana, bhatti vikramarka his deputyAnumula Revanth Reddy on Thursday took oath as Chief Minister of Telangana, becoming the first Congress CM of the younge...
Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...
కరోనా కల్లోలం : రూపాయి పతనంసాక్షి, ముంబై : ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. లాక్ డౌన్ ...