Chandrababu: యోగాకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని మోదీ: సీఎం చంద్రబాబు
Chandrababu: యోగాకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని మోదీ: సీఎం చంద్రబాబు"
Play all audios:
యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. అమరావతి: యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. ఉండవల్లిలో ‘యోగాంధ్ర’ వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో నిర్వహించుకునే
కార్యక్రమం యోగా అన్నారు. ఇది కొద్ది మందికో, కొన్ని ప్రాంతాలకో పరిమితమైంది కాదని.. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరమని పేర్కొన్నారు. అందరి జీవితాల్లో యోగా భాగం కావాలన్నారు. ఒత్తిడి
నుంచి ఉపశమనం కావాలంటే దీన్ని సాధన చేయాలని సూచించారు. ‘‘ఫొటోలు, ఈవెంట్ కోసం ఒకరోజు చేసే కార్యక్రమం కాదిది. ప్రతిఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమమిది. జీవనశైలిలో భాగమయ్యేలా
యోగాను ముందుకు తీసుకెళ్లాలి. నేటి నుంచి నెలపాటు యోగాంధ్ర-2025 నిర్వహిస్తున్నాం. కనీసం 2 కోట్ల మందికి తక్కువ కాకుండా పాల్గొనాలన్నది సంకల్పం. కనీసం 10 లక్షల మందికిపైగా యోగా సర్టిఫికెట్లు
ఇవ్వాలనేది లక్ష్యం. జూన్ 21న విశాఖలో 5 లక్షల మందితో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు కార్యక్రమం చేపడతాం. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు కార్యక్రమం నిర్వహిద్దాం. విశాఖలో జరిగే యోగా ఈవెంట్లో
ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. పాఠశాలల్లోనూ ఇక నుంచి రోజూ ఒక గంట యోగా ఉంటుంది’’ అని చంద్రబాబు తెలిపారు. (Andhra Pradesh News)
Trending News
Technology | latest tech news today - eenaduఐఫోన్ డేటా బదిలీ సులువుగా.. కొత్త ఐఫోన్ కొన్నారా? పాత ఐఫోన్ నుంచి డేటా మొత్తం బదిలీ చేసుకోవాలని అనుకుంటున్నారా? థర్డ్...
Roya Ijadi-Maghsoodi – The ConversationProfile Articles Activity Dr. Roya Ijadi-Maghsoodi is an Assistant Professor-in-Residence in the UCLA Department of Psyc...
Politics: రాయలసీమలో రాజకీయ చక్రం తిప్పిన కుటుంబానికి కష్టాలు.. పరిటాల రవి ఫ్యామిలీ పోటీపై సందిగ్ధంPublished by: Last Updated:February 10, 2024 6:16 PM IST POLITICS: అనంతపురం జిల్లాకు చెందిన దివంగత నేత, టీడీపీ నాయకుడు ప...
Army: ఆర్మీ యూనిఫామ్ అక్రమ తరలింపు.. మిలిటరీ ఇంటెలిజెన్స్ సాయంతో దాడులు..ఇంటర్నెట్‌డెస్క్: సైన్యానికి యుద్ధ రంగంలో ఉపయోగపడేలా ప్రత్యేకంగా డిజిటల్ టెక్నాలజీ సాయంతో సిద్ధం చేసిన యూనిఫామ్‌లను ప...
Anand mahindra: ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్Anand Mahindra: ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదేనంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ చిత్రాన్ని పం...
Latests News
Chandrababu: యోగాకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని మోదీ: సీఎం చంద్రబాబుయోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) తె...
India operations: ఆపరేషన్ ‘మేఘ్‌దూత్ నుంచి సిందూర్’ వరకుఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌పై దశాబ్దాలుగా వివాదాన్ని కొనసాగిస్తున్న పాకిస్థాన్ (Pakistan).. సీమాంతర ఉగ్రవాదాన్ని ...
Shraddha das: కొలంబోలో టాలీవుడ్ బ్యూటీ.. శ్రద్దాదాస్ ఎంజాయ్మెంట్ పిక్స్ వైరల్CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Fd rates: కస్టమర్లకు అదిరే శుభవార్త.. బ్యాంక్ కొత్త నిర్ణయం, రేపటి నుంచి అమలులోకి..Published by: Last Updated:January 28, 2023 5:56 PM IST FIXED DEPOSIT | బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? అ...
Special ops 2: యాక్షన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘స్పెషల్ ఓపీఎస్2 ’ వచ్చేస్తోందిSpecial Ops season 2 || (ఇంటర్నెట్‌డెస్క్): ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరించిన వెబ్‌సిరీస్‌ల్లో ‘స్పెషల్ ఓపీఎస్’ (S...