Sonia gandhi-rahul gandhi: నేషనల్‌ హెరాల్డ్‌ కేసు.. సోనియా, రాహుల్‌పై ఈడీ సంచలన ఆరోపణ

Eenadu

Sonia gandhi-rahul gandhi: నేషనల్‌ హెరాల్డ్‌ కేసు.. సోనియా, రాహుల్‌పై ఈడీ సంచలన ఆరోపణ"

Play all audios:

Loading...

దిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో (National Herald case) కాంగ్రెస్‌ అగ్రనాయకులు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌


డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేరంలో వారు రూ.142 కోట్లు లబ్ధి పొందారని ఆరోపించింది. నేరపూరిత ఆర్జనతో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, తర్వాత కూడా వారు అదే పంథాను కొనసాగించారని


పేర్కొంది. బుధవారం దిల్లీ ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణలో భాగంగా ఈడీ ఈ వాదనను వినిపించింది. నేషనల్ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్‌ ఆరోపణలతో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ,


రాహుల్‌ గాంధీని ఈడీ అధికారులు గతంలో పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. విదేశీ నిధులతో నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. సీబీఐ


విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ.. ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఈ కేసులో 2023, నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల


స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. * రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు.. కర్ణాటక హోం మంత్రికి ఈడీ షాక్‌ ఇందులోభాగంగా నోటీసులు జారీ చేసింది. ఆయా ఆస్తుల్లో ఉన్నవారు ఖాళీ చేయాలని పేర్కొంది.


అద్దెకు ఉంటున్నవారు ఇకపై తమకే ఆ మొత్తాన్ని చెల్లించాలని తెలిపింది. అక్రమ చెలామణి నిరోధక చట్టంలోని సెక్షన్‌ (8) నిబంధన 5(1) ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకొనే ప్రక్రియ


చేస్తున్నామని తెలిపింది. ఆస్తులు ఉన్న ప్రాంతాల్లో (దిల్లీ, ముంబయి, లఖ్‌నవూ) భవనాలకు నోటీసులు అంటించినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్‌ దాఖలు చేసిన


ఈడీ(Enforcement Directorate).. అందులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) సహా పలువురి పేర్లను పేర్కొంది. దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్‌


కంప్లయింట్‌ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిగింది.


Trending News

20 లక్షలు దాటిన కరోనా టెస్టులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటు కోవిడ్‌ నిర్ధా...

Team india | latest team india - eenadu

MOHAMMED SIRAJ: ‘ఆటో నడుపుకో’ అన్నారు! మహమ్మద్‌ సిరాజ్‌... ఒక ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఏకైక భారతీయ బౌలర్‌. గణాంకాల్ల...

Allu arjun's arrest, nayanthara vs dhanush, poonam pandey's death hoax: 10 controversies that rocked showbiz in 2024

Hema Committee Report, IC 814 The Kandahar Hijack row, and Darshan and Renukaswamy murder case were some of the other ma...

Vedantam: kuchipudi’s original sathyabhama

He continued to portray other roles in various dance-dramas. As Gollabhama in ‘Gollakalapam’, Mohini in ‘Mohini Rukmanga...

‘Idhem Kharma’: TDP’s new campaign to take on YSRCP, highlight anti-incumbency

The Telugu Desam Party (TDP) is all set to announce a state-wide campaign called ‘Idhem Kharma’. The 45-day campaign wil...

Latests News

Sonia gandhi-rahul gandhi: నేషనల్‌ హెరాల్డ్‌ కేసు.. సోనియా, రాహుల్‌పై ఈడీ సంచలన ఆరోపణ

దిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో (National Herald case) కాంగ్రెస్‌ అగ్రనాయకులు సోనియా గాంధీ (...

Sindoor, chooda, mangalsutra - priyanka chopra's 'just married' look is replete with desi swag

5.Bride and Groom's families bid goodbye to Jodhpur OUR PHOTOGRAPHERS ALSO CLICKED PRIYANKA'S ACTOR-COUSIN PAR...

Parineeti demands 5 million dollars from nick jonas as 'juta chuppai' fee after he flirts with priyanka chopra on insta

Parineeti Chopra's Insta banter with Nick Jonas is the cutest Jiju-Saali conversation ever Priyanka Chopra's p...

Boycott turkey: తుర్కియే, అజర్‌బైజాన్‌లకు.. భారీగా తగ్గిన వీసా దరఖాస్తులు

తుర్కియే, అజైర్‌బైజాన్‌లకు వచ్చే వీసా దరఖాస్తుల్లో ఇటీవల 42శాతం తగ్గుదల కనిపించినట్లు వీసా ప్రాసెసింగ్‌ సంస్థ అట్లీస్‌ వ...

Operation sindoor: ఉగ్రవాద వ్యాప్తికి సహకరించే వారికి సరైన సమాధానం ‘ఆపరేషన్‌ సిందూర్‌’: మోదీ

Operation Sindoor | ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో ఉగ్రవాదం వ్యాప్తి చేసేవారికి సరైన సమాధానం ఆపరేషన్‌ సిందూర్‌ అని ప్రధాని ...

Top